
హీరోయిన్ గా పెద్ద సినిమాలు మాత్రమే చేస్తానని కానీ, అవే కావాలని కానీ పట్టుదలతో కూర్చోవడం లేదు తమన్న. ఏది వస్తే అది చెయ్యడమే అనేది ఆమె పాలసీ. నిత్యం పని చెయ్యాలి. ఎప్పుడూ బిజిగా ఉండాలి అనేది ఆమె ఆలోచన. అందుకే ప్రతి సినిమాని, ప్రతి అవకాశాన్ని కాదనడం లేదు.
వెబ్ సినిమాలు కూడా సైన్ చేస్తోంది. ఇప్పటికే తమిళంలో ఒక వెబ్ సిరీస్, తెలుగులో ఒకటి నటించింది. ఇప్పుడు హిందీలో కూడా ఒక వెబ్ ఫిలిం చేస్తోంది.
“ప్లాన్ ఏ ప్లాన్ బి” అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక హిందీ సినిమాని తీస్తున్నాడు దర్శకుడు శశాంక్ ఘోష్. ఈ సినిమాలో రితేష్ దేశముఖ్ హీరో. హీరోయిన్ గా తమన్న నటిస్తోంది. రితేష్ దేశ్ముఖ్ కి ఇప్పుడు అసలు క్రేజ్ లేదు. అయినా… తమన్న ఈ మూవీ చేసేందుకు పెద్దగా ఆలోచించలేదు. ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ని తాజాగా షేర్ చేసింది తమన్న.
జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ హీరోగా స్లో అయ్యాడు. ఆయనతో సినిమాలు నిర్మించే మేకర్స్ తగ్గిపోయారు.