
తమన్న కెరీర్ ఎండింగ్ కి వచ్చినట్లే అనే మాటలు వినిపించాయి మొన్నటివరకు. కానీ ఇప్పుడు మళ్లీ ఆమెకి క్రేజ్ పెరుగుతోంది. ఆఫర్లు పెరుగుతున్నాయి. “గుర్తుందా శీతాకాలం” అనే సినిమాలో సత్యదేవ్ సరసన కొత్తగా సినిమా ఒప్పుకొంది. ఈ సినిమా లాంచ్ అయిందిప్పుడు.
వెంకటేష్ సరసన మళ్లీ “ఎఫ్ 3″లో నటించనుంది. అనిల్ రావిపూడికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనవరి తర్వాత షూటింగ్ షురూ అవుతుంది.
తమిళంలో కూడా ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. కానీ ఆమె ఇప్పుడు బిగ్ మూవీస్ కన్నా… స్మాల్ మూవీస్ పై ఫోకస్ వేసింది.
కాజల్ అగర్వాల్ లాగే, సీనియర్ హీరోలతో సినిమాలు చెయ్యడం, అలాగే ఇంకా క్రేజ్ రాని హీరోలతో నటించడమే అనే పాలసీని పాటిస్తోంది. దానివల్ల అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం గోపీచంద్ సరసన “సీటిమార్” సినిమాలో కూడా హీరోయిన్ గా దర్శనం ఇవ్వనుంది.