కోవిడ్ తో కోలుకున్న తమన్న

హైదరాబాద్ లో ఉండే హీరోయిన్లు అప్పుడప్పుడు తమ సొంతిళ్లకు వెళ్లడం కామన్. ఇందులో విశేషం లేదు. కానీ తమన్నకు మాత్రం తన సొంతింటిలో గ్రాండ్ వెల్ కమ్ లభించింది. దీనికి కారణం ఆమె కరోనా బారిన పడ్డమే.

కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడింది తమన్న. హైదరాబాద్ హాస్పిటల్ లో చిన్న ట్రీట్ మెంట్ తీసుకొని, తర్వాత హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయింది. అలా 2 వారాలుగా, తల్లిదండ్రులకు దూరంగా ఒంటరి జీవితం గడిపిన తమన్న.. ఇప్పుడు ముంబయిలోని తన సొంతింటికి వెళ్లింది.

కరోనా నుంచి కోలుకొని ఇంటికొచ్చిన కూతుర్ని చూసి తమన్న తల్లి భావోద్వేగానికి లోనైంది. గట్టిగా హత్తుకుంది. తండ్రి కూడా చలించిపోయాడు. అలా తల్లిదండ్రుల్ని కలుసుకున్న మిల్కీబ్యూటీ.. కొన్నాళ్ల పాటు ఇంట్లో రెస్ట్ తీసుకొని, తిరిగి మళ్లీ సెట్స్ పైకి రాబోతోంది.

Related Stories