
ఈ సారి ఆగస్టు 15 మంగళవారం వస్తోంది. సో ఇండిపెండెన్స్ డే సెలవును కూడా ఉపయోగించుకుంటే ఐదు రోజుల పాటు ఓపెనింగ్ కలిసి వస్తుంది. ఈ ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానుంది. ఇదే ప్లాన్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాని ఆగస్టు 10న విడుదల చేస్తున్నారు. ఒక రోజు గ్యాప్ లో సూపర్ స్టార్, మెగాస్టార్ పోటీపడబోతున్నారు.
ఐతే, ఈ రెండు సినిమాల్లో ఒకరే హీరోయిన్. ఆమె ఎవరో కాదు తమన్న. ‘భోళా శంకర్’లో చిరంజీవి సరసన, ‘జైలర్’లో రజినీకాంత్ సరసన నటిస్తోంది తమన్న. అంటే ఆగస్టులో మనం తమన్న వర్సెస్ తమన్న పోటీని చూడబోతున్నాం.
తమన్న ఇప్పుడు సీనియర్ హీరోల సరసన ఎక్కువగా సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో గతంలో ‘సైరా’ చిత్రంలో ఆమె నటించింది. కానీ అందులో ఆమె పాత్ర చిన్నది. మెయిన్ హీరోయిన్ నయనతార. ‘భోళా శంకర్’లో ఆమె ఫుల్ ఫ్లెడ్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించడం ఆమెకి ఇదే మొదటిసారి.
ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా ఆమెకి పెద్ద బూస్ట్.