తమన్నా ప్లాన్ బి!

Tamannaah Bhatia


తమన్న ఇంతకుముందు కేవలం తెలుగు, దక్షిణాది చిత్రాలపైనే ఫోకస్ పెట్టేది. ఆమె దృష్టి ఇప్పుడు హిందీపై ఉంది. అది కూడా ఓటిటి మాధ్యమంపైనే.

ఒక వారం రోజుల క్రితమే ఆమె నటించిన హిందీ చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదలైంది. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి కోసం తీసిన మూవీ అది. అలా హాట్ స్టార్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీకెండ్ ఆమె నటించిన మరో చిత్రం వచ్చింది. ఈ సినిమా పేరు… ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’. జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్, తమన్నా జంటగా నటించారు. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు. డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్.

రెండు వారాల్లోనే ఆమె నటించిన రెండు హిందీ చిత్రాలు ఓటిటి మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ విధంగా ఆమె తక్కువ టైంలో ఎక్కువ సంపాదిస్తోంది. టకా టకా ఒటిటి కోసం సినిమాలు, డ్రామాలు చెయ్యడం, చేతులు దులుపు కోవడం, అకౌంట్లోకి భారీ పారితోషికం తెచ్చుకోవడం ఆమె గేమ్ ప్లాన్ గా మారింది.

Tamannaah Bhatia

తెలుగు సినిమాలు ఆమెకి ప్లాన్ ఏ అయితే, ఓటిటి సినిమాలు ప్లాన్ బి. అన్నమాట. అలా కెరీర్లో నిత్యం బిజీగానే ఉంటోంది.

 

More

Related Stories