
తమన్న ఈ మధ్య తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోంది. డైలీ ఎదో ఒక ఫోటోషూట్ ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఇలా సడెన్ గా ఆమె ఫోటోషూట్ల హంగామాకి కారణమేంటి?
సమంత ఇలా చేసి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ తెచ్చుకొంది. తన సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది సమంత. కానీ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలతో ఆమె జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. ఆ తర్వాత “ది ఫ్యామిలీ మేన్ 2” వెబ్ సిరీస్ రావడం, పాపులారిటీ మరింత పెరగడం చకాచకా జరిగిపోయాయి. సమంత దారిలోనే తమన్న వెళ్తోంది.
Also Check: Tamannaah in a Sabyasachi HM collection
తమన్న బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కానీ సోషల్ మీడియాలో సమంత కన్నా తక్కువ ఫాలోయింగ్ ఉంది తమన్నకి. అందుకే ఈ భామ ఇప్పుడు ఫోటోషూట్ల హీట్ పెంచుతోంది. హీరోయిన్ గా తెలుగులో ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ఒటిటి, టీవీ షోలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా పాపులారిటీ పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.