పెద్ద చిత్రాలు చిన్న పాత్రలు

తమన్న హిందీలో పెద్ద వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఆమె చుట్టూనే తిరిగే కథలు అవి. కానీ, తెలుగు, తమిళ్ లో మాత్రం ఆమె ప్రాధాన్యం లేని పాత్రలు దక్కించుకుంటోంది. లేటెస్ట్ గా విడుదలైన “జైలర్”, “భోళా శంకర్” చిత్రాల్లో ఆమె నటించింది. ఒక సినిమాలో హీరోయిన్ గా, మరో సినిమాలో ఐటెంగాళ్ లాంటి రోల్ లో.

“జైలర్” చిత్రంలో ఒక సాంగ్, రెండు సీన్స్ లో మాత్రమే దర్శనం ఇస్తుంది తమన్న. ఇక చిరంజీవి నటించిన “భోళా శంకర్”లో ఆమె పేరుకే హీరోయిన్ రెండు పాటలు, మూడు సీన్లలో తప్ప కనిపించదు.

పెద్ద సినిమాల్లో నటించినా ఆమె చేసిన రోల్స్ మాత్రం చిన్నవి.

తమన్న ఇప్పుడు తన రోల్ ఏంటి అనే విషయం గురించి ఆలోచించడం లేదు కాబోలు. బిజీగా ఉన్నానా? ఫుల్ పారితోషికం వచ్చిందా లేదా అన్నట్లుగా సినిమాలు ఒప్పుకొంటోంది. ఇప్పటికే ఆమె 18 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకొంది.

Advertisement
 

More

Related Stories