మారకపోతే ఆంటీ రోల్స్ ఇచ్చేవాళ్ళు!

Tamannaah Bhatia

తమన్న ఇప్పుడు ఆమె చాలా బోల్డ్ గా మారింది. హాట్ హాట్ ముద్దు సీన్లు, సెక్స్ సీన్లు చేస్తోంది. ఎక్స్ పోజింగ్ లో మాములు దూకుడు చూపడం లేదు. మరి ఇంత బోల్డ్ గామారడానికి కారణం ఏంటి?

“ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ కి అనుగుణంగా మనం మారాలి. కొత్త తరాన్ని ఆకట్టుకోవాలంటే వాళ్ల ఆలోచనలకు తగ్గట్లు మనమూ మారాలి. లేదంటే అవుట్ డేటెడ్ అయిపోతాం. ఇప్పుడు సినిమాలు, వెబ్ కంటెంట్ లో చాలా మార్పు వచ్చింది. దానికి తగ్గట్లే నేను ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాలకు ఒప్పుకున్నాను. లేదంటే నన్ను ఇప్పటికే ఆంటీ, అక్క పాత్రలకు పరిమితం చేసేవాళ్ళు,” అని కుండబద్దలు కొట్టింది తమన్న.

“జీ కర్దా” అనే వెబ్ సిరీస్ లో బెడ్ రూమ్ సీన్స్ లలో రెచ్చిపోయింది. ఇక నెట్ ఫ్లిక్స్ వెబ్ డ్రామా “లస్ట్ స్టోరీస్ 2″లో తన నిజజీవిత ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సీన్లు, ఎక్స్ పోజింగ్ తో హీటెక్కించింది. “ఇదంతా ట్రెండ్ కి అనుగుణమే. తప్పేమి లేదు. జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా,” అని అంటోంది.

అలాగని రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కూడా అలాగే చేస్తానని అనుకోవద్దు అని చెప్తోంది. “జైలర్”లో రజినీకాంత్, “భోళాశంకర్”లో చిరంజీవిలాంటి సీనియర్ నటులతో సాంప్రదాయ, కమర్షియల్ చిత్రాలు కూడా  చేశాను కదా అని వివరణ ఇస్తోంది.

“జైలర్” ఈ నెల 10న విడుదల కానుంది. ఇక “భోళా శంకర్” ఆ మర్నాడు అంటే ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది.

Advertisement
 

More

Related Stories