సీనియర్లందరితో కానిచ్ఛేస్తున్న తమన్న

- Advertisement -
Tamannaah


తెలుగులో సీనియర్ హీరోలు…. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ.
ఇందులో చిరంజీవి, వెంకటేష్ తో రెండేసి సినిమాలు చేసింది తమన్న.

తమిళంలో సీనియర్ హీరోలు… కమల్ హాసన్, రజినీకాంత్.
తాజాగా రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమాలో తమన్న నటిస్తోంది.

బాలీవుడ్ లో సీనియర్ హీరోలు… అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్.
అజయ్, అక్షయ్ ల సరసన నటించింది.

మలయాళంలో సీనియర్ స్టార్స్… మోహన్ లాల్, మమ్మూట్టి, దిలీప్.
దిలీప్ సరసన తాజాగా ఒక సినిమా ఒప్పుకొంది. ఆమెకి ఇదే మొదటి మలయాళ చిత్రం.

Tamannaah

ఓవరాల్ గా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరితో తప్ప మిగతా సీనియర్ హీరోలందరి సరసన నటించింది తమన్న. మిగతా వారితో కూడా త్వరలోనే జత కట్టేలా ఉంది. వయసుపరంగా తమన్న చిన్నదే. ఇంకా ఆమెకి 32 ఏళ్ళు మాత్రమే. కానీ హీరోయిన్ గా మాత్రం చాలా సీనియర్. నటిగా ఆమె వయసు 16 ఏళ్ళు.

అందుకే, ఆమెని ఇప్పుడు సీనియర్ హీరోల సరసన తీసుకుంటున్నారు.

 

More

Related Stories