
ఈ సారి సంక్రాంతికి 4,5 తెలుగు సినిమాలు బరిలో దిగనున్నాయి. అందులో నాగార్జున, రవితేజ, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి పాపులర్ స్టార్స్ నటించిన మూవీస్ ఉన్నాయి. తమిళ్ లో మాత్రం 2024 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు.
అజిత్, విజయ్, సూర్య, కమల్ హాసన్, రజినీకాంత్, కార్తీ వంటి పాపులర్ హీరోల చిత్రాలేవీ సంక్రాంతికి సిద్ధం కావు. దాంతో, అక్కడ సంక్రాంతి స్లాట్ ని హీరోయిన్లు లాగేసుకుంటున్నారు.
తమన్న, రాశి ఖన్నా నటించిన ఒక హారర్ కామెడీ చిత్రం సంక్రాంతి బరిలో దిగనుంది. “ఆరన్ మనై” అనే హారర్ కామెడీ సిరీస్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగోది రాబోతుంది. ఈ సినిమాలో తమన్న, రాశి ఖన్నా నటించారు. లేడి ఓరియెంటెడ్ హారర్ కామెడీ ఈ “ఆరన్ మనై 4”. ఈ సినిమా రిలీజ్ డేట్ ని సంక్రాంతిగా అనౌన్స్ చేసింది టీం.
రాశి ఖన్నాకి ప్రస్తుతం తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. ఆమె తమిళ్ లో ఇలాంటి చిత్రాలు చేసుకుంటోంది. ఇక తమన్న వెబ్ సిరీస్ లపై ఫోకస్ నిలిపింది.