మాల్దీవుల్లో తమన్న ఎంజాయ్ మెంట్!

- Advertisement -


టైం దొరికితే చాలు మాల్దీవుల్లో వెకేషన్ కి వెళ్తున్నారు సినిమా తారలు. కొందరు సరదాగా వెళ్తుంటే కొందరి కొన్ని బ్రాండ్స్ ప్రొమోషన్ కోసం, అక్కడి టూరిజం రిసార్ట్ ల ప్రచారం కోసం వెళ్లి వస్తున్నారు. లేటెస్ట్ గా తమన్న చేరింది వీరి సరసన.

ఆమె ఇప్పుడు మాల్దీవుల్లోనే సరదాగా గడుపుతోంది. ఆమె ఒక బ్రాండ్ ప్రొమోషన్ కోసమే వచ్చింది. పనిలో పనిగా బీచుల్లో రకరకాల భంగిమల్లో ఫోజులు ఇస్తూ, సరదాగా సైకిల్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై షేర్ చేస్తోంది.

32 ఏళ్ల ఈ సుందరి హీరోయిన్ గా మళ్ళీ బిజీగా మారింది. దాంతో, పెళ్లి ఆలోచనని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. గతేడాది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవ్వాలని భావించింది. ఐతే, ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి.

బాలీవుడ్ లో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ సినిమా, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సెట్స్ పై ఉన్నాయి. ఇక విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో “ఎఫ్ 3”, “గుర్తుందా శీతాకాలం” ఉన్నాయి.

 

More

Related Stories