
హీరోయిన్ తమన్న ప్రేమలో పడింది కొంతకాలంగా ఒకటే వార్తలు. ఆ ప్రచారానికి తగ్గట్లే నిన్న ఒక వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియోలో తన బాయ్ ఫ్రెండ్ తో ముద్దులాట చేస్తూ చిక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో అతనితో డ్యాన్స్ చేస్తూ… హగ్గులు ఇచ్చింది. కిస్సులు ఇచ్చింది.
అదే పార్టీకి అటెండ్ అయిన కొందరు ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దాడుతున్న దృశ్యాన్ని తమ కెమెరాలో చిత్రీకరించారు. ఆ వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐతే, ఆమె అభిమానులకు మాత్రం ఆమె బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు. ఇంకో నటుడు దొరకలేదా డేటింగ్ కి? మరి అతనితోనా? అంటూ ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బాయ్ ఫ్రెండ్ విషయంలో ఆమెది రాంగ్ ఛాయిస్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు.
ALSO READ: Tamannaah and Vijay Varma spotted kissing?

ఇంతకీ ఆమె డేటింగ్ చేస్తున్నది ఒక పేరున్న నటుడితోనే. తెలుగులో ‘ఎంసిఏ’, బాలీవుడ్ లో ‘డార్లింగ్స్’ వంటి సినిమాల్లో నటించారు విజయ్ వర్మ. అతనితోనే ఆమె కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. తాజాగా అతనితో పార్టీలో లిప్ లాక్ చేసి వీడియో కంటికి చిక్కింది.
విజయ్ వర్మ మంచి టాలెంట్ ఉన్న నటుడు. పక్కా హైదరాబాదీ. ఐతే, తమన్న రేంజ్ వేరు కదా. ఎందరో టాప్ హీరోల సరసన నటించిన భామ ఆమె. హీరోయిన్ గా ఆమెకున్న పాపులారిటికీ మంచి అందగాళ్ళు, పెద్ద హీరోలు కూడా డేటింగ్ కి దొరుకుతారు కదా అనేది ఆమె అభిమానుల వాదన. కానీ, ఏ హీరోయిన్ అయినా తన మనసుకు నచ్చిన వాళ్ళతోనే డేటింగ్ చేస్తుంది కానీ అభిమానుల కోరుకున్న వాళ్లతో కాదు కదా.