
తమన్న అగ్ర కథానాయిక. సాధారణంగా పెద్ద హీరోయిన్లు ఎవరూ శృంగార సన్నివేశాల్లో నటించేందుకు ఒప్పుకోరు. అలాంటి సీన్లకు దూరంగా ఉంటారు. అందాల ఆరబోత విషయంలో తమన్న ఎప్పుడూ వెనకాడలేదు. కానీ, ఆమె ఇంతకుముందెప్పుడూ ‘సెక్స్’ సీన్లు చెయ్యలేదు.
కానీ, తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ లో అలాంటి సీన్స్ చేసినట్లు కనిపిస్తోంది.
“జీ కర్దా” అనే వెబ్ సిరీస్ లో నటించింది తమన్న. లావణ్య అనే పాత్రలో ఆమె నటించింది. వర్ధమాన నటుడితో ఆమె సెక్స్ సీన్లు చేసినట్లు ట్రైలర్ లో కనిపించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లో ముద్దు సీన్లు, సెక్స్ సీన్లు, బూతు మాటలు సర్వసాధారణం అయ్యాయి. కానీ తమన్న తన ‘పరిధిలోనే’ ఈ సీన్లు చేసిందట.
బికినీల్లో కనిపించడం, అందాల ఆరబోతకి అడ్డు చెప్పదు కానీ తమన్న ఇప్పటివరకు ముద్దు సీన్లలో కూడా నటించలేదు. ఆమె అలాంటి వాటికి వ్యతిరేకం. మరి తమన్న ఈ శృంగార సన్నివేశాలకు ఎలా ఒప్పుకుందో. తమన్న ఇంతకుముందు కూడా వెబ్ డ్రామాల్లో నటించింది. కానీ అప్పుడు అలా నటించలేదు మరి.

తమన్న ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ మూవీ చేస్తోంది. ఇది ఆగస్టు 11న విడుదల కానుంది.