ఐటెం సాంగ్ లో మోటివేషన్!

Tamannah


ఐటెం సాంగ్ అంటే కవ్వించాలి. పాటలో లిరిక్స్ కూడా డబుల్ మీనింగ్ తో ఉండడం కూడా సహజం. ఐతే, తమన్న తాజాగా చేసిన ఐటెం సాంగ్ కొంత కొత్తగా ఉంది. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ‘గని’ సినిమాలో తమన్న ఐటెం సాంగ్ చేసింది.

‘కొడితే’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో మోటివేషన్ కలిగించే పదాలను జోడించారు రచయిత రామజోగయ్య శాస్త్రి. తమన్ స్వరపరిచిన ఈ పాటలో తమన్న కూడా బాక్సింగ్ రింగ్ లో డ్యాన్స్ చేసింది. ఐటెం సాంగ్ కి, మోటివేషన్ లో సిట్యువేషన్ జోడించడం దీని ప్రత్యేకత.

తమన్నకి ఐటెం పాటలు కొత్త కాదు. ఇప్పటికే అనేక సినిమాల్లో అందాల ప్రదర్శన చేసింది. అందుకే, వెరైటీ కోసం ఇలా వెరైటీగా డ్యాన్స్ చేసింది కాబోలు.

Kodthe Lyrical | Ghani Songs | Varun Tej, Tamannaah| KiranKorrapati |AlluBobby |SidhuMudda |Thaman S

వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ, సిద్దూ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

 

More

Related Stories