అటువైపు చూపేసిన మిల్క్ బ్యూటీ

తమన్న నటించిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. షూటింగ్ లు, విడుదలలు అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. సత్యదేవ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఏడాది కాలంగా వాయిదా మీద వాయిదా పడుతోంది. ఇది ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఇక, ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోన్న ‘భోళా శంకర్’ కూడా వెనక్కి వెళ్ళింది. ఈ సినిమా కన్నా లేట్ గా స్టార్ట్ అయిన ‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతికి రానుంది. కానీ, ‘భోళా శంకర్’ మాత్రం వేసవికి వాయిదా పడింది.

తెలుగులో సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి రెండు సినిమాలు చేసింది. అవి డైరెక్ట్ గా ఓటిటిలోకి వచ్చాయి. కానీ, ఆమెకి అవి అనుకున్న పాజిటివ్ ఫలితాలు తీసుకురాలేదు.

దాంతో ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ పై దృష్టి పెట్టింది. ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఆమెకి 18 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ రష్మిక వంటి తనకన్నా జూనియర్ హీరోయిన్స్ కి 30 మిలియన్ల ఉన్నారు అని గ్రహించింది. అందుకే ఇన్ స్టాలో పాపులారిటీ పెరిగితే యూత్ కి ఎక్కువ కనెక్ట్ కావొచ్చు. దాంతో, ఆఫర్లు కూడా పెరుగుతాయి అని భావిస్తోంది.

 

More

Related Stories