అన్ని రిలీజ్ కి రెడీ!

- Advertisement -
Tamannaah

తమన్న నటించిన నాలుగు సినిమాలు వచ్చే రెండు, మూడు నెలల్లో మనముందుకు రానున్నాయి. గోపీచంద్ సరసన ఆమె నటించిన ‘సీటిమార్’ వచ్చేనెల థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్ 10కానీ, ఆ తర్వాత వారం కానీ విడుదల కానుంది. అలాగే , నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమాలో ఆమె విలన్ పాత్ర పోషించింది. ఇది డైరెక్ట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ సెప్టెంబర్ చివర్లో కానీ అక్టోబర్లో కానీ ఇది స్ట్రీమ్ అవుతుంది.

సీటిమార్, మాస్ట్రో.. రెండు సినిమాలు వచ్చే రెండు నెలల్లోనే విడుదల కానున్నాయి. అలాగే, ఆమె హీరోయిన్ గా నటించిన మరో మూవీ ‘గుర్తుందా శీతాకాలం’ నవంబర్లో రానుంది. ఇందులో సత్యదేవ్ హీరో.

ఇక ఆమె ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘గని’ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా దీపావళి కానుకగా రానుంది. అంటే ఈ నాలుగు చిత్రాలు డిసెంబర్ లోపే అన్ని విడుదలవుతాయి. తమన్న అభిమానులకు పండుగే.

ఆగస్టులోనే ఆమె హోస్ట్ చేస్తున్న తొలి టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది.

ALSO CHECK: Tamannaah’s stunning new pics

 

More

Related Stories