ప్రభాస్ పెళ్లిలా తమన్నా పెళ్లి!

ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు, పుకార్లు తగ్గాయి. కానీ రెండేళ్ల క్రితం వరకు ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం ఒక వార్త బయటికి వచ్చేది. అనుష్కతో పెళ్లి అని ఒకసారి, గోదావరి జిల్లాలకు చెందిన ఒక చుట్టపు అమ్మాయి అని ఇంకోసారి, బాలీవుడ్ హీరోయిన్ తో మేటర్ డీప్ గా వెళ్లిందని మరోసారి పుకార్లు షికార్లు చేశాయి.

‘ప్రభాస్ పెళ్లి గోల’ అంటూ ఒక సినిమాకి టైటిల్ కూడా పెట్టారు. ఆ రేంజ్ లో ఆయన పెళ్లి ప్రచారం జరిగింది. ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు ఇదే తరహాలో తమన్న పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఆమె పెళ్లి ఫిక్స్ అయిందని గత ఏడాది కాలంగా రెగ్యులర్ గా వార్తలు వస్తున్నాయి. వ్యాపారవేత్తతో అని ఒక వార్త, ఒక నటుడితో పెళ్లి అని మరో వార్త… ఇలా ఎదో ఒకటి వస్తోంది. మొన్నటి వరకు ఈ పుకార్లపై స్పందించని తమన్న నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీగా స్పందించింది. తానే మగాడిగా గెటప్ వేసుకొని గతంలో చేసిన ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఇతనే తాను చేసుకోబోయే మొగుడు అంటూ నవ్వుతూ ఆ పుకార్లకు తెరదించింది.

తమన్నకిప్పుడు 32 ఏళ్ళు. హీరోయిన్ గా చాలా ఏళ్లుగా నటిస్తోంది కాబట్టి ఆమె సీనియర్ అయిపొయింది. కానీ వయసు పరంగా ఆమె మిగతా సీనియర్ హీరోయిన్లతో పోల్చితే చిన్నదే.

Tamannaah Wedding Rumors

ALSO READ: Tamannaah reacts to wedding rumours with a funny post

 

More

Related Stories