తమన్న మెప్పించడం కష్టమే!

- Advertisement -
Tamannah Maestro


ఒక సినిమాని రీమేక్ చెయ్యడం ఎంత సులువో, అంత కష్టం కూడా. ఒరిజినల్ లో ఎలా ఉందో అలా తీస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఆ ఒరిజినల్ లో ఉన్న మేజిక్ ని, అందులో నటించిన ఆర్టిస్టుల తరహా నటన రాబట్టడం మాత్రం చాలా చాలా కష్టం. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… రీసెంట్ గా తెలుగులో రీమేక్ చిత్రాల వరద ఎక్కువైంది. ‘వకీల్ సాబ్’, ‘నారప్ప’… ఇలా వరుసగా వచ్చాయి. లైన్లో మరికొన్ని ఉన్నాయి. దాంతో ఒరిజినల్ చిత్రాలతో కంపారిజన్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే.. ఓటిటి వేదికపై ఒరిజినలు చిత్రాలు కూడా అందరికి అందుబాటులో ఉన్నాయి.

తాజాగా నితిన్ నటించిన ‘మేస్ట్రో’ ట్రైలర్ విడుదలైంది. హిందీలో హిట్టయిన ‘అంధధూన్’కిది రీమేక్. దర్శకుడు మేర్లపాక గాంధీ హిందీ చిత్రాన్ని యాజిటీజ్ గా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఐతే, ఈ సినిమాలో కీలకమైన పాత్ర…. విలన్ రోల్. హిందీలో టబు పోషించారు. తెలుగులో చేసిన నటి… తమన్న.

మిగతా విషయాలు ఎలా ఉన్నా.. రేపు సినిమా విడుదలయ్యాక ముందుగా మాట్లాడేది తమన్న గురించి. తమన్న ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చెయ్యలేదు. సెక్సీగా కనిపిస్తూ విలనిజం ప్రదర్శించాల్సిన పాత్ర అది. మరి టబులా తమన్న చేసిందా అన్నదే పెద్ద డౌట్. ట్రైలర్ చూస్తే… తమన్న హొయలు బాగా పోయింది అనిపిస్తోంది. మరి విలనిజం సంగతో? అది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

తమన్నకి ఇది పెద్ద ఛాలెంజ్. ఏ మాత్రం తేడా కొట్టినా ఆమె ట్రోలింగ్ ఎదురుకోవాల్సి వస్తుంది.

Gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

“మాస్ట్రో” థియేటర్లో విడుదల కావడం లేదు. డైరెక్ట్ గా హాట్ స్టార్ లో వచ్చేనెల 9న (September 9) స్ట్రీమ్ అవుతుంది.

Maestro | Official Trailer | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | September 17

More

Related Stories