బస్సు నడిపిన తమన్న

Tamannah Bhatia

తమన్న ప్రస్తుతం “సీటీమార్” సినిమాలో నటిస్తోంది. సంపత్ నంది డైరెక్టర్. గోపీచంద్ హీరో. ఈ సినిమాకి సంబందించిన ఒక సన్నివేశాన్ని పంట పొలాల్లో చిత్రీకరించారు. ఆ లొకేషన్ కి ఈ అమ్మడు బస్సులో వెళ్ళింది. అందులో విచిత్రం ఏమి లేదు. ఆ బస్సుని తానే డ్రైవ్ చేసింది.

“కారులో డ్రైవ్ చేసుకుంటూ పనికివెళ్ళడం కామన్ కదా… అందుకే ఇలా,” అంటూ బస్సు డ్రైవ్ చేస్తున్న వీడియోని కూడా ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ సినిమాలో ఆమె కబడ్డీ కోచ్ గా నటిస్తోంది. తెలంగాణ కబడ్డీ జట్టుకు ఆమె కోచ్ పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో తెలంగాణ యాసలోనే ఆమె డైలాగ్స్ చెప్తుంది.

More

Related Stories