మనీకి పడిపోయిన మిల్క్ బ్యూటీ

Tamannah

“అంధాథున్”లో టబు చేసిన బోల్డ్ నెగెటివ్ క్యారెక్టర్ కోసం చాలామంది పేర్లను పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా తమన్నను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ రీమేక్ లో టబు చేసిన పాత్ర కోసం అనసూయను అనుకున్నారు. కానీ ఆమె ఈ బోల్డ్ క్యారెక్టర్ చేసేందుకు నిరాకరించింది. రమ్యకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చినప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు. మధ్యలో నయనతారతో పాటు మరో 2-3 పేర్లు చక్కర్లు కొట్టినప్పటికీ.. ఫైనల్ గా ఈ పాత్ర పోషించడానికి తమన్న అంగీకరించింది.

ఇంతకీ తమన్న ఎలా ఒప్పుకొంది? మిగతా హీరోయిన్ల విషయంలో వర్కౌట్ కానిది తమన్నాతో ఎలా సాధ్యం అయింది.

తమన్నా కోరుకున్న పారితోషికం ఇచ్చేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి అంగీకరించాడట. తమన్న ప్రస్తుత పారితోషికం… సినిమాకి కోటి రూపాయల లోపే. ఇలాంటి టైంలో కోటిన్నర ఇస్తామన్నారట నిర్మాతలు. సో… వెంటనే సైన్ చేసింది తమన్నా.

మిల్క్ బ్యూటీని మనీతో ఒప్పించారన్నమాట.

Related Stories