తమన్నా ఉన్నా లాభం లేదు!


తమన్న సూపర్ అందెగత్తె. అంతే కాదు, పెద్ద హీరోయిన్లలో ఒకరు ఆమె. ఇప్పటికీ హీరోయిన్ గా బిజీగా ఉన్న భామ. అలాంటి పెద్ద హీరోయిన్ ఒక సినిమాలో నటిస్తే కనీస ఓపెనింగ్స్ రావాలి.

కానీ ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. ఈ సినిమాలో హీరో సత్యదేవ్. కానీ, సత్యదేవ్ కి ఇప్పుడు పెద్ద క్రేజ్ లేదు. ఆయన నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ ఫట్. సో, ఆయన పేరు మీద ఓపెనింగ్స్ రావు అని నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు ముందే ఫిక్స్ అయ్యాయి. కనీసం తమన్న కోసమైనా జనం వస్తారేమో అనుకున్నారు.

ఈ సినిమాని ప్రోమోట్ చేసేందుకు ముందు తమన్న ఒప్పుకోలేదు. ఆమెకి ఈ సినిమా ఆడుతుందన్న నమ్మకం లేదు. ఐతే, సత్యదేవ్ వల్ల జనం వచ్చేలా లేరు మీరు వస్తే బెటర్ అని ఆమెని ప్రొమోషన్ కి రప్పించారు నిర్మాతలు. ఆమె హడావుడి చేసినా జనం చూపు వెయ్యలేదు సినిమాపై.

‘గుర్తుందా శీతాకాలం’ గత శుక్రవారం వారం విడుదలైంది. ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తే నిర్మాత పెట్టిన టీ, టిఫిన్స్ ఖర్చులకి కూడా సరిపోవు.

అంత ఘోరమైన వసూళ్లు. తమన్నా ఉన్నా జనం దయచూపకపోవడం అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

More

Related Stories