
సంగీత దర్శకుడు తమన్ మొన్నటివరకు మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయన నుంచి ఊపేసే పాటలు రావడం లేదు. తమన్ తాజాగా “బ్రో” సినిమాకి పాటలు అందించారు. ఇంతకుముందు వచ్చిన పాట పెద్దగా క్లిక్ కాలేదు. తాజాగా వచ్చిన రెండో పాట కూడా మెప్పించేలా లేదు.
రెండవ పాటగా ‘జాణవులే’ విడుదలైంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటలో సాయి ధరమ్ తేజ్, ఆయనకు జోడిగా నటించిన కేతిక శర్మపై తీశారు. “జాణవులే నెరజాణవులే.. నా జాన్ నువ్వులే జాణవులే.. వాణివిలే అలివేణివిలే.. నా మూన్ నువ్వులే జాణవులే” అంటూ సాగే ఈ సాంగ్ సాదాసీదాగా ఉంది.
ప్రస్తుతానికి ఐతే తమన్ పాటలు ఈ సినిమాకి హెల్ప్ అయ్యేలా లేవు. సినిమాలో బాగుంటే విడుదల తర్వాత క్లిక్ కావొచ్చు.
సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రధాన చిత్రం కాదు. కానీ ఒక సాంగ్ అయినా వైరల్ ఐతే వచ్చే క్రేజ్ వేరు. ఈ విషయంలో మాత్రం తమన్ నిరాశపర్చిన మాట వాస్తవం. “భీమ్లా నాయక్” సినిమా పాటలు విడుదలకు ముందే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా విషయంలో అలా జరగలేదు.