బీజేపీలో చేరనున్న వడివేలు?

Vadivelu

వచ్చే వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో భారతీయ జనతా పార్టీ… జనాలకి తెలిసిన కొన్ని ఫేసులు వెతికే పనిలో పడింది. తమిళనాడులో బీజేపీ బలం జీరో. ఐతే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఈసరి ఎన్నికల్లో ఎంతో కొంత బలపడుదామని ప్రయత్నిస్తోంది. అలా సినిమా తారలను లాగే పనిలో పడింది బీజేపీ. తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఖుష్బూని రప్పించింది. ఇప్పుడు వడివేలు పేరు వినిపిస్తోంది. వడివేలు కమెడియన్ గా ఒక లెజెండ్. ఐతే… కొన్నేళ్ల క్రితం డీఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసి కెరీర్ నాశనం చేసుకున్నాడు. జయలలిత బతికున్న టైంలో అతను ఆమెకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడంతో అన్నాడీఎంకే అతని కెరీర్ కి బ్రేకులు వేసిందని కామెంట్స్ ఉన్నాయి.

మరి ఇప్పుడు అతని బీజేపీలో చేరుతాడనే ప్రచారం జరుగుతోంది. వడివేలు మాత్రం ఈ వార్తలపై మౌనం వహిస్తున్నాడు.

Related Stories