దీపావళికి త’మిళ’మిల!


అక్టోబర్ 21న నాలుగు పేరున్న హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒక్క సినిమానే తెలుగు చిత్రం. మిగతావి ‘తమిళ’ కనెక్షన్ తో కూడినవి. దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తున్న ఆ చిత్రాలు…’ఓరి దేవుడా’, ‘జిన్నా’, ‘ప్రిన్స్’, ‘ ‘సర్దార్’.

ఈ మూడింటికీ తమిళ మూలం

‘ఓరి దేవుడా’… ఇందులో హీరో విశ్వక్ సేన్. సినిమా తెలుగు చిత్రమే. దేవుడిగా నటించింది కూడా వెంకటేష్. అంటే పూర్తిగా తెలుగు చిత్రమే. కానీ ఇది ఒక తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో తీసిన దర్శకుడే తెలుగులో దీన్ని తీస్తున్నాడు. అలా ఈ తెలుగు చిత్రానికి ‘తమిళ’ కనెక్షన్ ఉంది.

‘ప్రిన్స్’… తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన చిత్రమిది. తెలుగు చిత్రంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు అనుదీప్ (జాతిరత్నాలు దర్శకుడు), నిర్మాత సునీల్ నారంగ్ తెలుగు వాళ్ళే. కానీ, కథ, కథనాల బట్టి ఇది పూర్తిగా తమిళ వాసనతో ఉంది.

‘సర్దార్’ … కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ పక్కా తమిళ చిత్రం. తెలుగులో డబ్ అవుతోంది. ఈ మూడు ఎదో రూపేణా తమిళ మూలాలు ఉన్నవే.

జిన్నా
మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మాత్రమే పూర్తిగా తెలుగు చిత్రం. ఇది కూడా అక్టోబర్ 21న రానుంది.

 

More

Related Stories