ప్రభాస్ ని టార్గెట్ చేసిన తమిలోళ్లు!


ప్రభాస్ … ఆల్ ఇండియా స్టార్. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ సంపాదించుకున్నాడు. తమిళనాట కూడా ప్రభాస్ కి మంచి క్రేజు ఉంది. పైగా ఎలాంటి వివాదాలు లేని పెద్ద హీరో ప్రభాస్. అలాంటి ప్రభాస్ ని తమిళీయులు టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాలో ‘ఆదిపురుష్’కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిలో ఎక్కువ శాతం తమిళీయులే. వాళ్ళకు ప్రభాస్ పై ఎందుకు అంత కసి? కోపం? దానికి ఓ కారణం ఉంది.

సరిగ్గా మూడు రోజుల క్రితం తమిళ దర్శక దిగ్గజం మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజయ్యింది. ఐతే, ఈ సినిమా తమిళంలో తప్ప ఇతర భాషల్లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా తెలుగు క్రిటిక్స్, ప్రేక్షకులు ఎక్కువ విమర్శలు చేశారు.

దాంతో, తమిళీయులకు మండింది. తెలుగు సినిమాల డామినేషన్ ఎక్కువైంది అన్న కోపం వారిలో బాహుబలి టైం నుంచి ఉంది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఎగబడి చూస్తున్నారు. దాంతో, తమిళ హీరోలు, దర్శకులు వెనుకబడ్డారు. ఒకప్పుడు తామే గొప్ప అని ఫీలయిన తమిళ సినిమా ఇండస్ట్రీలో కొందరు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ఇప్పుడు జెలసీతో ఇదైపోతున్నారు. ‘పొన్నియన్ సెల్వన్ 1’ని తెలుగువాళ్లు రిజెక్ట్ చేశారన్న కోపాన్ని ప్రభాస్ సినిమాపై తీర్చుకుంటున్నారు.

‘ఆదిపురుష్’ టీజర్ ఎవరికీ నచ్చలేదు. మరి కార్టూన్ సినిమాలా ఉంది. దాంతో, కరెక్ట్ టైంలో తెలుగోళ్లు దొరికారన్న ఆనందంతో కొందరు తమిళ వీరాభిమానులు ‘ఆదిపురుష్’కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ మొదలుపెట్టారు.

 

More

Related Stories