జనవరి 26న విక్రమ్ మూవీ

- Advertisement -
Tangalaan

విక్రమ్ నటిస్తున్న “తంగలాన్” సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. “కాలా”, “కబాలి” వంటి సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ తీస్తున్న మూవీ ఇది. జనవరి 26న విడుదల చేస్తామని తాజాగా నిర్మాతలు ప్రకటించారు.

పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ మూవీలో . కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

“తంగలాన్” సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా మూవీ. నవంబర్ 1వ తేదీన “తంగలాన్” టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు టీం వెల్లడించింది.

ఈ సినిమా కోసం విక్రమ్ చాలా బరువు తగ్గారు.

 

More

Related Stories