‘సైనైడ్’లో హాలీవుడ్ కథానాయిక

'సైనైడ్'లో హాలీవుడ్ కథానాయిక

రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘సైనైడ్’. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిత్రంజన్ గిరి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, సమీర్, సంజు శివరామ్, షాజు, ముకుందన్, రిజు బజాజ్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.

లేటెస్ట్ గా హాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీ కూడా ఈ మూవీలో చేరారు. ‘లయన్’, ‘బియాండ్ ది క్లౌడ్స్’, ‘యాంగ్రీ ఇండియన్ గాడ్స్’, ‘పార్ట్చ్’ వంటి చిత్రాలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.

“తనిష్టా ఛటర్జీ రాకతో మా ‘సైనైడ్’ టీమ్ మరింత బలపడింది. ఆమె మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది” చిత్ర నిర్మాత ప్రదీప్ నారాయణన్ అన్నారు. “20మంది అమ్మాయిలని ప్రేమ పేరుతో ప్రేరేపించి, శారీరకంగా అనుభవించాక వారికి ‘సైనైడ్’ ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించాం” అని అన్నారు దర్శకుడు రాజేష్.

More

Related Stories