తనుశ్రీ దత్తా రీఎంట్రీ ఇస్తోంది!

Tanushree Dutta

తనుశ్రీ దత్తా గుర్తుందా? నందమూరి బాలకృష్ణ సరసన “వీరభద్ర” (2005)లో నటించింది ఈ బాలీవుడ్ భామ. “ఆషిక్ బనాయా అప్నా” సినిమాలో ముద్దు సీన్లతో మొదట పాపులర్ అయింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాల్లో కనిపించిన ఈ భామ… ఆ మధ్య నానా పటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది.

తనుశ్రీ బాలీవుడ్ ని వదిలేసి అమెరికాలో సెటిల్ అయింది. ఐతే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తాను అంటూ ప్రకటించింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద పోస్ట్ పెట్టింది.

“ఇప్పటికీ బాలీవుడ్ లో నాకు మంచి పేరు ఉంది. గుడ్ విల్ కూడా ఉంది. ఇప్పటికే సినిమా ఆఫర్లు, వెబ్ సిరీస్లు కొన్ని వచ్చాయి. పలువురు దక్షిణాది చిత్రాల నిర్మాతలు, మేనేజర్లు కూడా టచ్ లోకి వచ్చారు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ (బాలీవుడ్) నిర్మించే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం కూడా ఉంది,” అని చెప్పుకొచ్చింది.

తనుశ్రీ సినిమాల్లో రీఎంట్రీ కోసం 15 కిలోల బరువు తగ్గింది. ఆమెకిప్పుడు 36 ఏళ్ళు.

నిజంగా ఆమె చెప్పుకుంటున్న రేంజ్ లో ఆఫర్లున్నాయా అనేది డౌటే. ఈ కరోనా కారణంగా పేరొందిన హీరోయిన్లకే సినిమాలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా, ఆమె మళ్ళీ సినిమాల్లో నటించాలనుకోవడం… మంచి నిర్ణయమే.

Related Stories