‘మాఫియా వేధిస్తోంది…ఐనా చావను’

Tanushree Datta

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని గతంలో ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన తనుశ్రీ దత్తా మరోసారి న్యూస్ లోకి వచ్చింది. బాలీవుడ్ మాఫియా తన చావు కోసం చూస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా తనుశ్రీ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.

“నన్ను వేధిస్తున్నారు. నన్ను టార్గెట్ చేశారు. మొదట నాకు బాలీవుడ్ లో పని దక్కకుండా చేశారు. ఆ తర్వాత నా పని మనిషి ద్వారా విషప్రయోగం చేశారు. నేను ఉజ్జయిని వెళ్తుంటే నా కారుకి యాక్సిడెంట్ చేయించారు. చావు తప్పించుకొని ముంబైలోకి అడుగుపెడితే నా ఇంటి ముందు గలాటా చేస్తున్నారు. అయినా, నేను చావను. నేను ఆత్మహత్య చేసుకోను,” అని రాసింది.

“నేను ఇక్కడినుంచి వెళ్ళను. చావను. పోరాడుతూనే ఉంటా. బాలీవుడ్ మాఫియాని వదిలే ప్రసక్తే లేదు. కొన్ని రాజకీయ శక్తులు, బాలీవుడ్ మాఫియా కలిసి నా పతనం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇక్కడి యంత్రాగాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి,” అని రాసింది.

ఐతే, ఆమె వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొందరు ఉన్నారని, ఆమెని రాజకీయంగా వాడుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె తాజాగా రాసిన పోస్ట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పాలించాలని కోరుకొంది. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలసీలని పొగుడుతూ ఇటీవలే ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది.

 

More

Related Stories