
తాప్సి బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకొంది. తెలుగులో పెద్ద హీరోల సరసన నటించింది. మంచి గ్లామర్ పాత్రలు పోషించింది. ఇక్కడ సక్సెస్ లు కూడా చూసింది. కానీ నటిగా మాత్రం బాగా పాపులరయింది మాత్రం బాలీవుడ్ లోనే.
హిందీలో ఆమె ఆఫ్ బీట్ సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించి బాగా కీర్తి గడించింది. “మంచి నటి” అన్న నేమ్ తెచ్చుకొంది. ఐతే, బాలీవుడ్ లో కూడా ఒక పెద్ద హీరో సరసన నటించి పెద్ద హిట్ అందుకోవాలన్న ఆమె కోరిక ఇప్పటివరకు తీరలేదు. ఆ అవకాశం షారుక్ హీరోగా రూపొందిన “డంకి”తో తీరేలా ఉంది.
షారుక్ ఖాన్ టాప్ హీరో. అంత పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడమే ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్.
ఐతే పెద్ద హీరో సరసన అవకాశం రావడమే కాదు ఆ హీరోతో భారీ హిట్ అందుకుంటే హిందీ సినిమా ఇండస్ట్రీలో తనకు లాంగ్ కెరీర్ ఉంటుంది. అందుకే ఆమె “డంకి” భారీ హిట్ కావాలని ప్రార్థనలు చేస్తోంది. ఈ వీకెండ్ ఆమెకి నిజమైన పరీక్ష.