పాయల్ ప్లేస్ లో తార

Payal Rajput and Tara Sutaria

‘RX100’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది పాయల్ రాజపుత్. ఆ తర్వాత ‘వెంకీమామ’ సహా పలు సినిమాలు చేసింది. ఐతే, ఆమె కెరీర్ మాత్రం ఎదుగూబొదుగూ లేకుండా అలాగే ఉంది. ‘RX100’ లాంటి హిట్ మళ్లీ తగల్లేదు. ఐతే, ఇప్పుడు ‘RX100’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

హీరోగా సునీల్ శెట్టి కొడుకు నటించనున్నాడు. ఐతే, ఈ సినిమా కథలో హీరో కన్నా హీరోయినే కీలకం. ఆ పాత్రకి తార సుతారియా అనే అప్ కమింగ్ హీరోయిన్ ని తీసుకున్నారట. తార సుతారియా పాయల్ కన్నా రెచ్చిపోయి నటించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో బోల్డ్ గా ఉంటాయి సినిమాలు. మరి ఇలాంటి కథ దొరికితే, బాలీవుడ్ ఊరుకుంటుందా?

తారకి ఈ సినిమా నిజంగా బ్రేక్ ఇస్తుందా?

More

Related Stories