మెలెన వల్లే తారకరత్నకు విషమం

హీరో నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐతే, తారకరత్న ఆరోగ్యం ఇంత విషమంగా మారడానికి కారణం ఒక అరుదైన వ్యాధి అని డాక్టర్లు గుర్తించారు. ఆయనకి మెలెన అనే వ్యాధి ఉందట. కానీ తారకరత్నకు ఈ విషయం తెలియదు.చికిత్సలో భాగంగా హృదయాలయ డాక్టర్ లు దీన్ని గుర్తించారు.

ఈ వ్యాధి ఉన్నవాళ్లు మెలెనా వ్యాధి వున్నవారు ఎలాంటి‌ మెడికేషన్ లేకుండా నేరుగా రన్నింగ్ చేయడం, ఒక్కసారిగా వాకింగ్ చేయడం చెయ్యకూడదంట. ఈ విషయం తెలియని తారకరత్న పాదయాత్రలో పాల్గొన్నారు.

మెలెన కారణంగా నోరు, అన్నవాహిక, చిన్న ప్రేగు వద్ద అధికంగా రక్తస్రావం జరిగిందట. దాని వాళ్ళ శరీరంలోని చాలా భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయి దేహం రంగు మారింది. అందుకే అత్యంత విషమం అయింది అని వైద్యులు చెప్తున్నారు.

గుండెనాళాల్లోకి రక్త ప్రసరణ కష్టం మారడంతో ప్రస్తుతం ECMO ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూర్ వెళ్లారు.

మేలెన అంటే…!

మెలెన అనేది పేగులకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా అరుదైన వ్యాధి. అన్నవాహికలో రక్తం కారడం, చిన్న ప్రేగు వద్ద అధికంగా రక్తస్రావం జరగడం ఈ వ్యాధి కారణంగా జరుగుతుంది. అల్సర్ లు ముదరడం వల్ల ఈ వ్యాధి వస్తుందట. ఒక విధంగా చెప్పాలంటే ఇదోరకమైన అల్సర్.

మలం బొగ్గులా నల్లగా మారడం, రక్తం కారడం ఈ వ్యాధి మొదటి లక్షణాలు.

Advertisement
 

More

Related Stories