ఎన్నికల బరిలో తారకరత్న?


2023, 2024 ఎన్నికల సీజన్. ముందుగా తెలంగాణాలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో (లెక్క ప్రకారం) ఎన్నికలు జరుగుతాయి. సో, సినిమా తారలు కూడా ఎన్నికల ప్రచారం చెయ్యడమో, బరిలోకి దిగడమో చేస్తారు. ఇప్పటి నుంచే టాలీవుడ్ తారల హడావిడి మొదలైనట్లు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం తరఫున ప్రచారం చేస్తాడా లేదా అన్న చర్చ అప్పుడే మొదలైంది.

ఇక లేటెస్ట్ గా నందమూరి తారకరత్న తన అభిమతం వెల్లడించాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనేది తన ప్లాన్ అని చెప్పాడు తారకరత్న.

ఆయన ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నాడు. ఐతే, తారకరత్న ఆలోచనలకు తగ్గట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందిస్తారా? ఆయన కోరుకున్న సీట్ ఇస్తారా అన్నది చూడాలి.

తారకరత్నకు ప్రస్తుతం సినిమాల్లేవు. ఆయన మేకప్ వేసుకొని చాలా కాలమే అవుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం ఎప్పుడూ ప్రచారం చేస్తున్నారు. పార్టీకి విదేయుడుగా ఉంటున్నారు.

 

More

Related Stories