తరుణ్ కొత్త ఐడియా

హీరోగా క్లిక్ అవ్వకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే. మరీ ముఖ్యంగా మార్కెట్ జీరోకు పడిపోయిన తర్వాత కెరీర్ మార్చుకోవాల్సిందే. ఒకప్పటి హీరో తరుణ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. నటుడిగా సిల్వర్ స్క్రీన్ తనకు కలిసిరాకపోవడంతో ఇప్పుడు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

అవును.. త్వరలోనే నిర్మాతగా మారబోతున్నాడట ఈ మాజీ హీరో. ఒకేసారి 3 ప్రాజెక్టులు సెట్ చేసినట్టు చెబుతున్నారు. వీటిలో ఒకటి థియేట్రికల్ రిలీజ్ కోసం కాగా.. మరో 2 సినిమాల్ని నేరుగా ఓటీటీకి ఇచ్చేలా (సెన్సార్ సమస్యలు ఉండవు) ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు 3 కథల్ని తరుణ్ ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే నిర్మాతగా మారినంతమాత్రాన యాక్టింగ్ ను వదిలేయాలని అనుకోవడం లేదు తరుణ్. ఓవైపు మూవీస్ నిర్మిస్తూనే, మరోవైపు మంచి పాత్రలు (హీరో వేషాలు కాకుండా) పోషించడానికి సై అంటున్నాడు. 2018 తర్వాత తరుణ్ మళ్లీ తెరపై కనిపించలేదు.

Related Stories