ఆ హీరోయిన్ తో సంబంధం లేదు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు బోండా ఉమా ఒక విచిత్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నేత ఒక హీరోయిన్ తో కలిసి హైదరాబాద్ లోని స్టార్ హోటల్ నుంచి బయటికి వస్తున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు తిరుగుతున్నాయి. నిజానికి, ఆ ఫొటోల్లో హీరోయిన్ ముఖం కనిపించడం లేదు. హోటల్ గేట్ వద్ద ఒక అమ్మాయి అతని వెనుక నడుస్తున్నట్లు మాత్రమే ఉంది ఆ ఫొటోలో. దాంట్లో అభ్యంతర పెట్టాల్సింది ఏమి లేదు.

ఆమె హీరోయిన్ అవొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ, హీరోయిన్ అయినా కూడా బోండా ఉమా గెట్ దాటి బయటికి వెళ్తున్నప్పుడే, ఆమె అదే టైం లో వెళ్తుందేమో. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ నాలుగు ఫొటోల్లో వేరే “మీనింగ్” ఏమి కనిపించడం లేదు.

ఐతే, ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ ఫోటోలను ఉపయోగించుకొని … “ఎదో” ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారట. “ఆ హీరోయిన్ ఎవరో నాకు తెలీదు. ఆ ఫొటోల్లో కనింపించే ఆమెకి నాకు సంబంధం లేదు… ఈ ప్రచారాన్ని చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి,” అంటూ బోండా ఉమా హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Related Stories