- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా మరోసారి మన ముందుకొస్తున్నాడు. అతను నటించిన మూవీ… ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ అవుతుంది. తాజాగా టీజర్ విడుదలైంది.
‘‘బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి సినిమాగా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ వస్తుంది. చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ స్థాయికి వచ్చాం. మాకు తెలిసింది నటన మాత్రమే. ఇంకా ఇంకా కష్టపడతాను’’ అన్నారు హీరో సోహైల్.
‘‘సినిమా అనేది చిన్న బిడ్డతో సమానం. సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేసేశాం. ఇక ఆడియెన్స్‌దే బాధ్యత. కలెక్షన్స్ కంటే సినిమా బావుందని అంటే చాలు,” నిర్మాత హరిత గోగినేని మాట అది.
డిసెంబర్ 30న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు దర్శకుడు అభి.