తెగింపు… మరో బీస్ట్!


విజయ్ హీరోగా నటించిన బీస్ట్ ఈ వేసవిలో (2022) విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ మూవీ ఒక హీస్ట్ థ్రిల్లర్. బ్యాంక్ దోపిడీ కథతో తెరకెక్కిన ఆ సినిమా ఘోర పరాజయం చవి చూసింది. విజయ్ స్టార్డం కూడా ఆ సినిమాని కాపాడలేకపోయింది. ఇప్పుడు అజిత్ హీరోగా ‘తెగింపు’ వస్తోంది. ఇది కూడా బ్యాంక్ దోపిడీ జాన్రా మూవీనే.

తమిళంలో ‘తునివ్’గా, తెలుగులో ‘తెగింపు’గా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం బ్యాంక్ ని కొల్లగొట్టే కథ అని అర్థమవుతోంది.

అజిత్ కుమార్ ఇందులో విలన్ షేడ్స్ ఉన్న హీరోగా నటిస్తున్నారు. మొత్తం యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ సినిమా ట్రైలర్ లో మలయాళ నటి మంజు వారియర్ కొత్తగా కనిపిస్తున్నారు. 44 ఏళ్ళ మంజు వారియర్ పూర్తిగా యాక్షన్ రోల్ లో కనిపించడం విశేషం.

Thunivu Official Trailer | Ajith Kumar | H Vinoth | Zee Studios | Boney Kapoor | Ghibran

ఐతే, విజయ్ హీరోగా రూపొందిన ‘బీస్ట్’ ఎక్కువగా కామెడీ మీద ఫోకస్ పెట్టి అటు కామెడీ మూవీ కాకుండా, ఇటు యాక్షన్ మూవీ కాకుండా ఢమాల్ అయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీలా కనిపిస్తుంది. దర్శకుడు వినోద్ ఇంతకుముందు తీసిన ‘ఖాకీ’ వంటి సినిమాల కారణంగా దీనిపై కొంత హాప్ పెట్టుకోవచ్చు.

 

More

Related Stories