తేజ: ‘హనుమాన్’తో లైఫ్ మారింది

Hanu Man

ప్రశాంత్ వర్మ తీసిన ‘హను-మాన్’ సూపర్ హిట్ అయింది. తేజ సజ్జ కథానాయకుడిగా నటించారు ఈ సినిమాలో. ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది అంటున్నాడు తేజ.

“ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా వుంది. హనుమాన్ నా కెరీర్ లో ఒక మలుపు. థియేటర్లు తక్కువ దొరికిన మాట వాస్తవమే కానీ ఇది తప్పకుండా నాలుగు వారాలు పైగా ఆడుతుంది అని బలంగా నమ్మాం. అదే నిజం అవుతోంది. అందుకే చాలా అనందంగా ఉంది,” అన్నాడు తేజ.

హను మాన్ సినిమాలో అన్ని ఫైట్లు తానే సొంతంగా చేశాడట. “డూప్ కాదు అన్ని ఒరిజినల్ గా చేసినవే.”

“చిరంజీవి గారు సినిమా విడుదలైన వెంటనే మెసెజ్ పెట్టారు. ‘కంగ్రాట్స్ మై బాయ్. సో ప్రౌడ్ ఆఫ్ యు ’ అని నాకు మెసేజ్ పెట్టారు. చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ మాపై ఎప్పుడూ ఉన్నాయి,” అని ఆనందంగా చెప్తున్నాడు తేజ.

కొత్త సినిమా ఒకటి ఒప్పుకున్నాడట. దాని వివరాలు త్వరలోనే చెప్తాను అంటున్నాడు.

 

More

Related Stories