
“ఓ బేబి”, “జాంబిరెడ్డి” చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా నటించిన మరో చిత్రం… ‘అద్భుతం’. హీరో రాజశేఖర్ కూతురు శివాని ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా డిస్ని హాట్ స్టార్ లో విడుదలవుతోంది. ఈ శుక్రవారం (నవంబర్ 19) థియటర్లలో కానీ, ఓటిటిలో విడుదలవుతోన్న సినిమాల్లో ప్రముఖమైంది ఇదే.
రామ్‌మల్లిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నాడు తేజ. “ఇది రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కథ విషయానికి వస్తే ఒక ఇద్దరికి ఒకే ఫోన్ నెంబరు రావడం జరుగుతుంది. హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడంతో జరిగిన పరిణామాలు ఏంటి అనేది చూపించాం. చాలా ఫ్రెష్ గా కథ, కథనాలు ఉంటాయి,” అని చెప్పాడు ఈ కుర్ర హీరో.
” అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లతో ఎంగేజింగ్ గా సాగుతుంది,” అనేది తేజ మాట. ఈ ఏడాది తేజకిది మూడో మూవీ. ‘జాంబీరెడ్డి’, ‘ఇష్క్ నాటే లవ్ స్టోరీ’ విడుదలయ్యాయి.
“సినిమా కంటెంట్ బాగుంటే ఎంత లోప్రొఫైల్‌లో రిలీజ్ చేసినా ప్రేక్షకులకు చేరుతుంది. అద్భుతం కూడా అలాగే జనాలకు నచ్చుతుంది అని నమ్మకం ఉంది,” అని తేజ అంటున్నాడు.