
ఉదయ్ కిరణ్ చావుకి కారణమెంటో తెలుసు అంటున్నారు దర్శకుడు తేజ. ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేసింది తేజనే.
‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ‘మనసంతా నువ్వే’తో స్టార్ అయ్యాడు. ఎంత వేగంగా హీరోగా ఉన్నతస్థాయికి చేరుకున్నాడో, అంతే వేగంగా కెరీర్ లో కష్టాలు చూశాడు. ఐతే, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం ఒక పెద్ద షాక్. అతని చావు వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు.
ఆత్మహత్య చేసుకునేలా అతన్ని ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి, శక్తులేంటి అనేది తనకి తెలుసు అని తేజ చెప్తున్నారు. ఐతే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం సబబు కాదు అని కూడా తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, తాను చనిపోయేలోపు ఆ విషయాన్నీ బయటపెడుతా అంటున్నారు.
ఉదయ్ కిరణ్ డెత్ వెనుక ఉన్న మిస్టరీ మిస్టరీగానే ఉండిపోదు అని హామీ ఇస్తున్నారు తేజ. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా అని అంటున్నారు.