తేజ మరో మూవీ’ విక్రమాదిత్య’

- Advertisement -
Vikramaditya

సీనియర్ దర్శకుడు తేజ మళ్ళీ బిజీ అయ్యారు. ఇప్పటికే రానా సోదరుడు అభిరాం హీరోగా ‘అహింస’ అనే ఒక సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ‘విక్రమాదిత్య’ అనే సినిమాని ప్రకటించారు.

నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ‘విక్రమాదిత్య’ కథ 1836 సంవత్సరంలో జరుగుతుందట.

సర్ ఆర్థర్ కాటన్ ధ‌వ‌లేశ్వరం బ్యారేజీని అదే సమయంలో నిర్మించారు. ఈ క‌థ ఆ కాలం నాటిద‌ని, ఆ వంతెన‌కు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉంద‌ని టాక్. ఒక కొత్త జంట పరిచయం అవుతోంది ఈ మూవీతో.

‘చిత్రం’ మూవీతో తెలుగు సినిమా రంగంలో ఒక సంచలనం రేపారు తేజ. ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘జయం’ వంటి బ్లాక్ బస్టర్లు తీశారు. రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆయన పొందిన ఒక హిట్.

More

Related Stories