
దర్శకుడు తేజ త్వరలోనే ఓటీటీలోకి ఎంటరవ్వబోతున్నాడని, ఈ మేరకు బడా ఓటీటీ సంస్థలతో చర్చలు కూడా జరుపుతున్నాడని TeluguCinema.Com గతంలోనే బ్రేక్ చేసింది. అతడు ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న విషయాన్ని చాన్నాళ్ల కిందటే చెప్పాం. ఇప్పుడు తేజ అదే పని మీద ఉన్నాడు.
తేజ స్వయంగా ఓ వెబ్ సిరీస్ ఐడియా క్రియేట్ చేశాడు. దాన్ని డెవలప్ చేసే పనిని తన శిష్యుడు రాకేష్ కు అప్పగించాడు. అంతేకాదు.. ఈ సిరీస్ దర్శకత్వ బాధ్యతల్ని కూడా అతడికే అప్పగించి, తను దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నాడు.
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టుడియోస్ లో ప్రారంభమైంది. అదే టైమ్ లో తేజకు కరోనా సోకడంతో ఆయన వెబ్ సిరీస్ చేస్తున్న విషయం బయటకొచ్చింది.
ట్రయిలర్ తో పాటు 2 ఎపిసోడ్స్ రెడీ చేసిన తర్వాత ఓటీటీ సంస్థలతో చర్చలు జరపాలనేది తేజ ప్లాన్. అప్పటివరకు ఫండింగ్ ఈయనదే. ఈ వెబ్ సిరీస్ కు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.