దూకుడు తగ్గించిన తేజస్వి

Tejaswi

ఒకప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రోజుకో హాట్ హాట్ ఫోటో ఉండేది తేజస్వి నుంచి. సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసిన తేజస్వి మడివాడలో ఈ కోణం కూడా ఉందా అని అందరూ ఆశర్యపోయేలా చేసింది. స్కిన్ షోతో కేక పుట్టించింది. ఒక సన్నీ లియోన్, ఒక పూనమ్ పాండేని మరిపించింది. అదంతా గతం.

ఇప్పుడు తేజస్వి మొత్తంగా సంప్రదాయబద్ధంగా మారింది. అలాంటి ఫోటోషూట్ లకు బ్రేక్ ఇచ్చినట్లుంది. అలాగే, సోషల్ మిడియాలో పోస్టులు కూడా తగ్గించింది. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కూడా యాక్టు చేసింది. కానీ అలాంటి పాత్రలు, ఫోటోషూట్ ల వల్ల ఆమె కెరీర్ కి ఎలాంటి హెల్ప్ కలగలేదు. పైగా రావాల్సిన పాత్రలు, సినిమాలు కూడా రాకుండా పోయాయి.

అందుకే కాబోలు, తేజస్వి ఇప్పుడు దూకుడు తగ్గించింది. ఐతే, పర్మినెంట్ డెసిషనా? లేదా విరామం మాత్రమేనా?

More

Related Stories