‘రాత్రికి రమ్మన్నారు’….ప్రమోషన్ కోసమే!

Tejaswi Madivada

“కాస్టింగ్ కౌచ్ మాటల వల్ల పెళ్లి సంబంధం పోయింది!”

“అందరూ పడక గది అనుభవం గురించి అడుగుతుంటే చిరాకేస్తోంది”

“కమిట్ మెంట్ అడిగిన వారిని ధైర్యంగా ఎదురుకున్నా”

ఇలాంటి భారీ స్టేట్మెంట్ లతో కలకలం రేపింది తేజస్వి మడివాడ. కానీ అదంతా ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అంటూ ప్లేట్ ఫిరాయించింది. “కమిట్ మెంట్” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ … సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి చుట్టూ తిరుగుతుంది. ఆ వెబ్ సిరీస్ లోని టాపిక్ మీద నా అభిప్రాయాలను వెల్లడించాను. అంతేతప్ప, అవి నా లైఫ్ లో ఫేస్ చేసినవి కావు అంటూ మెల్లగా చెప్తోంది. అంటే తనని “రాత్రికి రమ్మన్నారు” అని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉత్తదే(నట).

అంటే ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలాంటి మాటలు కూడా చెప్తారు అన్నమాట. ఇప్పుడు హీరోయిన్లు చెప్పే మాటల్లో ఎదో నమ్మాలో ఎదో పబ్లిసిటీ చెప్పడం కష్టమే బాస్.

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో సమంత ఫ్రెండ్ గా మొదట గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అనేక చిత్రాల్లో కీలక పత్రాలు, హీరోయిన్ వేషాలు వేసి తనకంటూ మంచి ఫోలోయింగ్ సంపాదించుకొంది. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లకి అంత హంగామా జరిగింది.

ఇది కూడా చూడండి: నగ్నంగా నటించామన్నారు

 

More

Related Stories