తెలంగాణ సాయుధ పోరాటంలో విజయ్?

Vijay Deverakonda and Sukumar

జస్ట్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. ఈ సినిమా 2022లో ఎప్పుడో మొదలవుతుంది. ఇంకా రెండేళ్ల టైం ఉంది ప్రారంభం అవ్వడానికి. అంటే ఇంకా కథ అంటూ ఏమి అనుకోలేదు సుకుమార్. ఐతే ఈ మూవీ స్క్రిప్ట్ పై పుకార్లు అందుకున్నాయి. అయితే అవి గాలిపుకార్లు మాత్రం కావు. పక్కా లాజిక్ తో తెరపైకొచ్చిన రూమర్లు. అదేంటంటే.. తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంలో విజయ్ దేవరకొండ-సుకుమార్ సినిమా ఉంటుందట.

దీని వెనక ఓ లాజిక్ కూడా ఉంది.

“రంగస్థలం” సినిమా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా చేయాలనుకున్నాడు సుకుమార్. ఆ విషయాన్ని ఈమధ్య సుకుమార్ స్వయంగా ప్రకటించాడు కూడా. తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించుకొని చదివాడు. అంతేకాదు.. ఓ స్టోరీలైన్ కూడా రాసుకున్నాడు. 6 నెలలు కష్టపడి స్టోరీ-స్క్రీన్ ప్లే రాసిన తర్వాత, మహేష్ బాబుకి వినిపించాడు. కానీ మహేష్ కి ఈ కథ రిస్క్ అని నో చెప్పాడు. దాంతో ఆ సబ్జెక్ట్ ను పక్కనపెట్టేశాడు సుకుమార్.

అలా తన మనసుకు ఎంతో నచ్చిన ఆ సబ్జెక్ట్ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్. విజయ్ దేవరకొండ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, ఆయనకు తెలంగాణ యాసపై పట్టు ఉండడంతో ఈ గాసిప్ ఊపందుకుంది.

Also Read: ఈ ప్రాజెక్ట్ బన్ని సెట్ చేశాడా!

ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బన్నీతో చేస్తున్న “పుష్ప” సినిమాపైనే పెట్టాడు సుక్కూ. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Stories