
కియరా అద్వానీ…. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో కూడా వెరీ పాపులర్. ఇప్పటికే ‘వినయ విధేయ రామ’, ‘భరత్ అనే నేను’ వంటి సినిమాల్లో నటించి ప్రస్తుతం రామ్ చరణ్ సరసన శంకర్ డైరెక్షన్లో నటిస్తోంది. తెలుగు సినిమాకి నాలుగు కోట్లు తీసుకునే ఈ భామకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
త్వరలో మొదలు కావాల్సిన రెండు పెద్ద సినిమాల్లో ఈ భామని అడిగారు. కానీ, డేట్స్ లేవని చెప్పి తిరస్కరించింది.
నిజంగానే ఆమెకి కాల్సిట్ల సమస్య ఉంది. రామ్ చరణ్, శంకర్ సినిమా ఆగుతూ ఆగుతూ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని పక్కన పెట్టి ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు శంకర్. అటు ‘భారతీయుడు 2’, ఇటు రామ్ చరణ్ సినిమా చేస్తూ కియరా డేట్స్ మొత్తం లాక్ చేశారు శంకర్.

పైగా ఆమె చేస్తున్న బాలీవుడ్ చిత్రాలు కూడా పెద్దవే. వాటికి డేట్స్ ఇచ్చుకుంటూ, ఇటు శంకర్ సినిమాకి నెలల కొద్దీ డేట్స్ ఇస్తూ షూటింగ్స్ చేస్తోంది. అందుకే, రెండు తెలుగు పెద్ద సినిమాలను ఇప్పుడు చేయలేనని చెప్పి తిరస్కరించింది.
వచ్చే ఏడాది మార్చి వరకు కష్టమే అని చెప్పింది. అందుకే, ఆమె చెయ్యాల్సిన సినిమాలు ఇతరులకు వెళ్తున్నాయి. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసి ఇస్తే మాత్రం నిర్మాతలకు, దర్శకులకు పండగే.