వెబ్ ‘డబ్బు’

రాశిఖన్నా, సమంత, కాజల్, తమన్న… టాలీవుడ్ హీరోయిన్లు అందరూ వెబ్ జాబ్ కి రెడీ అవుతున్నారు. అదేనండి… ఓటిటి వేదికల కోసం నిర్మిస్తున్న చిత్రాలు, సిరీసుల్లో నటిస్తున్నారు. మొదట బెట్టు చేశారు. ఇప్పుడు సై అంటున్నారు. ఎందుకంటే పైసా మీ పరమాత్మ.

కాజల్
కాజల్ అగర్వాల్ నటించిన మొదటి వెబ్ సిరీస్….”లైవ్ టెలికాస్ట్”. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫిబ్రవరి 12న విడుదల. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో డబ్ చేశారు .

సమంత
సమంత ఇప్పటికే “ది ఫ్యామిలీ మేన్ 2” వెబ్ సిరీస్ లో నటించింది. వచ్చే నెలలో ఇది అమెజాన్ లో ప్రసారం అవుతుంది. ఆమె ఇప్పటికే “అహా” కోసం టాక్ షో నిర్వహించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. మరిన్ని సైన్ చెయ్యాలనుకుంటోంది.

రాశి ఖన్నా
రాశి ఖన్నా హిందీలో ఒక వెబ్ డ్రామా అంగీకరించింది. షాహిద్ కపూర్ హీరో. రాజ్ డీకే తీస్తున్నారు. ఆమెకిదే ఫస్ట్ వెబ్ షో. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

తమన్న
“11th Hour” అనే తెలుగు వెబ్ ఫిలింలో తమన్న నటించింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. షూటింగ్ పూర్తి అయింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ లో కూడా ఒక వెబ్ ఫిలిం పూర్తి చేసింది తమన్న.

శృతి హాసన్
శృతి హాసన్ మొదటి వెబ్ ఫిలిం వచ్చేనెలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. “పిట్ట కథలు” పేరుతో నాలుగు కథలను కలిపి ఒక మూవీగా తీశారు. అందులో ఒక కథలో శృతి హీరోయిన్.

సాయి పల్లవి తమిళంలో ఒక వెబ్ ఫిలింలో యాక్ట్ చేసింది. ఇషా రెబ్బ, ప్రియమణి, అంజలి… ఇలా లిస్ట్ పెరుగుతూనే ఉంది. అందరూ ఇప్పుడు వెబ్ లబ్ డబ్ అంటూ సందడి చేస్తున్నారు.

More

Related Stories