రష్మికి సరైన పార్టనర్ దొరికాడు

Rashmi Gautam

బుల్లితెర స్టార్ రష్మి, నటుడు సుడిగాలి సుధీర్ మధ్య వచ్చినన్ని గాసిప్స్ మరే జంటపై వచ్చి ఉండవేమో. తామిద్దరి మధ్య ఏమీ లేదని వీళ్లు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ ఈ పుకార్లు ఆగడం లేదు. అందుకే బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. ఈ గాసిప్స్ ను క్యాష్ చేసుకునేందుకు గతంలో ఈటీవీ ఛానెల్ వీళ్లకు ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసేసింది. నాగబాబు, రోజా లాంటి వాళ్లు ఆ పెళ్లికి అతిథులుగా కూడా వెళ్లారు.

ఇలాంటి క్రేజీ జంటను వెండితెరపైకి కూడా తీసుకురావాలని అనుకున్నాడు నిర్మాత శేఖర్ రాజు. కానీ ఆఖరి నిమిషంలో రష్మీ కాల్షీట్లు సెట్ అవ్వకపోవడంతో సుడిగాలి సుధీర్ ను హీరోగా పరిచయం చేసినప్పటికీ.. రష్మీని అతడికి జోడీగా సెట్ చేయలేకపోయాడు.

అయితే ఈసారి మాత్రం ఈ నిర్మాత పక్కా ప్లాన్ తో ఉన్నాడు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ డేట్స్ ఇతడి వద్ద ఉన్నాయి. ఇప్పుడు రష్మి నుంచి కూడా పక్కాగా డేట్స్ సంపాదించాడు ఈ ప్రొడ్యూసర్. సో.. బుల్లితెరపై సెన్సేషనల్ జోడీగా ఉన్న రష్మి-సుధీర్.. త్వరలోనే వెండితెరపై కూడా కనిపించబోతున్నారన్నమాట.

Related Stories