ఊపిరి పీల్చుకున్న బుల్లితెర

Ohmkar

సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా సోకడంతో టెలివిజన్ రంగం ఉలిక్కిపడింది. ఆ మరుసటి రోజు నుంచే మొత్తం షూటింగ్స్ ఆపేశారు. ఆ వెంటనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్ష చేయించుకున్నారు. అయితే అలా పరీక్షలు చేయించుకున్న 33 మందికి నెగెటివ్ వచ్చింది. దీంతో బుల్లితెర ఊపిరిపీల్చుకుంది.

అటు ప్రభాకర్ మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. అతడితో పాటు ఇతర ప్రొడక్షన్ సంస్థలకు చెందిన మరో 8 మందికి పాటిజివ్ అని నిర్థారణ కావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటున్నారు. వీళ్లు మినహాయిస్తే మిగతా ఎవ్వరికీ కరోనా సోకినట్టు సమాచారం లేదు. అటు నటుడు, బుల్లితెర స్టార్ ఓంకార్ కు కూడా కరోనా నెగెటివ్ వచ్చింది.

ప్రస్తుతానికైతే స్టార్ మా, జీ తెలుగు, జెమినీ ఛానెళ్లకు సంబంధించి సీరియల్స్ వ్యవహారాలన్నీ సర్దుకున్నాయి. ఈసారి మరిన్ని ముందు జాగ్రత్తలతో షూటింగ్స్ నిర్వహించబోతున్నాయి ఈ ఛానెల్స్. అయితే ప్రభాకర్ తో లింక్ ఉన్న 4 సీరియల్స్ మాత్రం ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయనేది అగమ్యగోచరంగా మారింది.

Related Stories