సల్మాన్ చిత్రంలో తెలుగుతనం!


తెలుగు సినిమాల నటులు, దర్శకులు, రచయితలపై సల్మాన్ ఖాన్ కి బాగా గురి పెరిగింది. ఇంతకుముందు తెలుగు సినిమాల కథలను తీసుకొని హిందీలో రీమేక్ చేసేవాడు సల్లూబాయ్. ఇప్పుడు తెలుగు వాళ్లని తన సినిమాలో కీలక పాత్రల్లో తీసుకుంటున్నారు ఈ సూపర్ స్టార్.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే. ఆమె తెలుగులో సూపర్ స్టార్. ఇక, మరో కీలకమైన పాత్రలో మన సీనియర్ హీరో వెంకటేష్ కనిపిస్తారు. వెంకటేష్ ఈ మూవీలో పూజ హెగ్డేకి బ్రదర్ గా నటిస్తున్నారు.

ఇంతకీ, ఈ సినిమాలో విలన్ ఎవరు అనుకుంటున్నారు? అవును… మీ గెస్ కరెక్ట్. తెలుగు నటుడే విలన్. జగపతి బాబుకి ఆ అవకాశం దక్కింది. అలా ఒకే సినిమాలో ముగ్గురు తెలుగు స్టార్స్ ని తీసుకున్నారు సల్మాన్ ఖాన్.

ఇక ఆయన కూడా ఒక తెలుగు సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు అనేది పాత న్యూస్. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ నటిస్తున్నారు.

 

More

Related Stories